పెళ్ళిళ్ళకి వెళ్ళడమంటేనే నాకు చిరాకు. దానికి తోడు ఈ ట్రాఫిక్ జాం ఒకటి. అరగంట నుండి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఉన్నాము. గట్టిగా కారు హారన్ కొట్టాను. నా ముందున్న బైక్ వాడు చిరాగ్గా నా వైపు చూసి తల తిప్పుకున్నాడు. గట్టిగా కారు హారన్ కొట్టినంత మాత్రాన ట్రాఫిక్ క్లియర్ అవుతుందా రా మహేష్ అంది అత్త. నేను అసహనంగా చూశాను వాళ్ళ వైపు. వీడి ముఖం చూస్తే భలే ఫన్నీగా ఉంది కదమ్మా అంది నా మరదలు మానస. అది వెక్కిరించడం చూసి నాకు ఇంకా కోపం పెరిగిపోయింది. అసలే నేను చిరాకులో ఉంటే మధ్యలో దీని అల్లరి. ఏంటే నువ్వు వాణ్ణి ఆటపట్టిస్తున్నావ్. వాడు మన కోసం వస్తుంటే నువ్వు వాణ్ణి అల్లరి పట్టిస్తున్నావా అంది సునంద అత్త తన కూతురు మానసని. సారీ బావా, నీ ముఖం చూస్తే నవ్వొచ్చింది. ప్లీజ్ ఫర్ గివ్ మీ.. అంది తన చెవులు పట్టుకుని. తను ఒఠ్ఠి అల్లరి పిల్ల. తను అలా జాలిగా ముఖం పెట్టేప్పటికి నాకు ఏదోగా అనిపించి చాల్లేవే అని నవ్వేశాను. అత్త, మానస ఇద్దరూ నా నవ్వులో శృతి కలిపారు. ఇంతలో ట్రాఫిక్ క్లియర్ అవడంతో వేగంగా కారుని ముందుకి కదిలించాను.
కరీమ్ అంకుల్ వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళుతున్నాము మేము. కరీమ్ అంకుల్ వాళ్ళు మా మావయ్య కుటుంబానికి ఫామిలీ ఫ్రెండ్స్. వాళ్ళబ్బాయి షఫీ పెళ్ళి ఈ రోజు. మావయ్యకి అర్జెంట్ పని ఉండడంతో నిన్న బాంబే వెళ్ళాడు. ఈ రోజు వస్తాడు. మావయ్య ఫ్లయిట్ లేట్ అవ్వడంతో తను నేరుగా ఎయిర్ పోర్ట్ నుండి పెళ్ళి మండపానికి వచ్చేస్తానన్నాడు. నన్ను అత్తయ్య, మానస ని తీసుకురమ్మన్నాడు. మంచి క్రికెట్ మాచ్ చూద్దామని కూర్చున్న వాడిని మావయ్య మాట కాదనలేక, తప్పక అత్త వాళ్ళని పికప్ చేసుకుని పెళ్ళికి వెళుతూ ఇదిగో ఇలా ట్రాఫిక్ లో చిక్కుకుని బయటపడ్డాం.