అది డిగ్రీ కాలేజీలో నా మొదటి రోజు, నాలుగు నెలలు ఆలస్యంగా జాయిన్ అయ్యాను. కాలేజీ ప్రిన్సిపల్ని కలసి నాకు సంభందించిన అన్ని certificates ఇచ్చి నా క్లాసురూముకి వెళ్ళాను. అందరు నావంక అదోల చూస్తున్నారు కారణం ముందుచేప్పినట్లుగా లేట్ జాయినింగ్. వెళ్లి ఆఖరు బెంచ్లో కూర్చున్నాను.ప్రక్కన ఉన్న వ్యక్తిని హాయ్ అని పలకరించాబోయాను అతను మన HOD క్లాసు చెపుతున్నాడు తరువాత మాట్లాడుకుందాం అని గొణిగాడు నేను అబ్బో అనుకుని క్లాసు విందామని ట్రై చేశాను. వాడు ఏదో అడుగుతున్నాడు వీళ్ళు ఏదో చెపుతున్నారు నాకేమి అర్ధంకావట్లేదు.
↧